e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News బిగ్ బాస్ ఫేం సోహైల్ సేవ‌కు స‌త్కారం

బిగ్ బాస్ ఫేం సోహైల్ సేవ‌కు స‌త్కారం

బిగ్ బాస్ కార్యక్ర‌మంతో లైమ్‌లైట్ లోకి వ‌చ్చిన సోహైల్ ప‌లు సినిమా ఆఫ‌ర్స్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఇత‌ని చేతిలో మూడుకు పైగా సినిమాలు ఉన్నాయి. మ‌రోవైపు టీవీ షోస్‌తోను అడ‌పాద‌డ‌పా సంద‌డి చేస్తున్నాడు. అయితే సోహైల్‌కు అశేష ఆద‌ర‌ణ ద‌క్క‌గా అది కేవ‌లం అత‌ని టాలెంట్‌ని చూసి కాదు, ఆయ‌నలో ఉన్న సేవాత‌త్ప‌ర‌త వ‌ల్ల కూడా. బిగ్‌బాస్‌ ద్వారా బహుమతిగా తనకు లభించిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథ అశ్రమాలకు అందజేశారు.

సోహి హెల్పింగ్‌ హాండ్స్‌’ స్థాపించి తద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న సోహైల్ ఇటీవ‌ల సినీ కార్మికులకు నిత్యావ‌స‌ర వ‌స్తువులు అంద‌జేసి మాన‌వ‌త్వం చాటుకున‌నాడు. సొహైల్‌ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రైజింగ్‌ స్టార్‌ అవార్డుతో సత్కరించారు. సొహైల్‌కు రైజింగ్‌ స్టార్‌ అవార్డును లయన్‌ కేవీ.రమణారావు, లలితారావు క‌లిసి అంద‌జేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana