మెరుపు తీగ శోభిత ధూళిపాళ రోజూ జిమ్‌లో ఎన్ని వర్కవుట్లు చేస్తుందో అనుకుంటాం! కానీ, ఈ మధ్యే జిమ్‌లో చేరానని చెబుతున్నదామె. అందుకు బలమైన కారణాన్ని కూడా షేర్ చేసుకుంది. గూఢచారి, పీఎస్-1 చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన శోభిత తాజాగా ‘ద నైట్ మేనేజర్’ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నది. అందులో నటిస్తున్న బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్ ఫిట్నెస్ చూశాకే జిమ్ బాట పట్టాలని నిర్ణయించుకుందట.
‘అనిల్ సర్ తన వయసు చెప్పడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆయన తన వయసు ఎంతో చెప్పినా.. అలా కనిపించరు. అంత ఫిట్‌గా ఉంటారు. ఇక ఆదిత్యరాయ్ సంగతి సరేసరి! వాళ్లిద్దరి ఎనర్జీ చూశాక, నా ఫిట్‌నెస్‌పై అనుమానాలు మొదలయ్యాయి! వాళ్లు డైట్ విషయంలో కచ్చితంగా ఉంటారు. నేనేమో షాట్ గ్యాప్‌లో సమోసాలు, బిస్కెట్లు లాగించేస్తుంటాను. ‘ద నైట్ మేనేజర్’ షూటింగ్లో వాళ్లతో కలిసి పనిచేశాక, జిమ్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు షూటింగ్ అయిపోగానే నేరుగా జిమ్‌కే వెళ్తున్నా!’ అంటూ తన జిమ్ ప్రయాణం ఎలా మొదలైందన్నది వివరించింది శోభిత.