Sobhita Dhulipala | శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే శోభిత ఇందులో ‘సంధ్య’ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మరియు పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపిస్తోంది. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, ముఖ్యంగా తన స్నేహితుల మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. ‘చీకటిలో’ అనే పేరుతో ఆమె నిర్వహించే ట్రూ-క్రైమ్ పాడ్‌కాస్ట్ ద్వారా సీరియల్ కిల్లర్ గురించిన షాకింగ్ నిజాలను ఎలా వెలికితీసింది అనేది ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో జనవరి 23న విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మిస్తుండగా.. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.