Sandhya Theatre | ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య ధియేటర్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఇక్కడ జాతరే.. సంధ్య థియేటర్ లో సినిమా రిలీజ్ అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇందులో సినిమా చూడడం సెంటిమెంట్‌గా భావించేవారు. ఈ థియేటర్ లో ముందుగా హిందీ సినిమా షాలిమార్ ను ప్రదర్శించారు. ఆ తరువాత సూపర్ డూపర్ హిట్ షోలే రిలీజ్ కాగా, ఇక అప్పటి నుండి ఈ థియేటర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సంధ్య థియేటర్ ప్రస్థానం కొనసాగింది.
అయితే ఈ మధ్య సంధ్య థియేటర్ పెద్ద వివాదంలో చిక్కుకుంది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా ఈ కేసులో బాధితులుగా చేర్చారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ లోని నగరం నడిబొడ్డున గల సంధ్య థియేటర్ లలో పాములు రావడం పెద్ద చర్చగా మారింది.
సిబ్బంది ప్రతిరోజులానే థియేటర్లలో తమ విధుల్లో ఉన్నారు. 50 రూపాయలు టికెట్ ఎంట్రీ వద్ద టికెట్స్ తీసుకుని సినిమాకు వస్తున్న వాళ్లను లోనికి వదులుతున్నారు. ఇంతలో అక్కడున్న సిబ్బంది పక్కన ఎదో బుస్ బుస్ మంటూ చప్పుడు వస్తుండటంతో అటు వైపు చూశారు. అక్కడ రెండు పాములు కన్పించాయి. వెంటనే యాజమాన్యంకి సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. థియేటర్ లలో పాములు ఏమైన వెళ్లాయా.. అని అక్కడున్న సిబ్బంది బ్యాటరీలు, లైట్లు వేసుకుని మరీ చెక్ చేశారు. కొన్ని పాముల్ని సైతం స్నేక్ క్యాచర్ లు పట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఆర్టీసీ సంధ్య థియేటర్ వద్ద పాముల కలకలం
హైదరాబాద్ ఆర్టీసీ X రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
తరచూ పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన@HydPSPKFansRTCX @RtcxRoadNTRfans @NtrMaruthi9999 @laxman_travel #Telangana #Hyderabad #Congress #BRS #KTR #BJP… pic.twitter.com/h4W4F79Fhb
— Telugu Galaxy (@Telugu_Galaxy) June 11, 2025