యువ హీరో శివకార్తికేయన్ కథా నాయకుడిగా రాజ్ కమల్ ఫిల్మ్ ్స ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయిక. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎస్కే21 టైటిల్ టీజర్‌ను 16న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ వీడియోలో జిమ్‌లో ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తూ కనిపించిన శివకార్తికేయన్‌ను ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా చూడొచ్చు. డిఫరెంట్ గన్స్‌ను ఫైర్ చేస్తూ కనిపించడం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. దేశభక్తి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. దీనికి సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, రచన-దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి.