Shivaji Raja | టాలీవుడ్ నటుడు శివాజి రాజా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఎన్నో సినిమాలలో నటించిన ఆయన పలు సీరియల్స్ కూడా చేశాడు. మా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితే చాలా రోజులుగా శివాజి రాజా పెద్దగా కనిపించడం లేదు. తాజాగా యాంకర్ వర్ష.. కిస్సిక్ టాక్ షోకి గెస్ట్‌గా వచ్చిన శివాజీ రాజా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసి అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా ప్రోమో మాత్రమే విడుదల కాగా, ఇందులో ఆయన లవ్ స్టోరీ గురించి.. మెగాస్టార్‌తో ఉన్న అనుబంధం గురించి.. తన స్మోకింగ్, మందు అలవాట్లు గురించి అన్ని వివరంగా చెప్పుకొచ్చాడు.
శివాజీ రాజా మాట్లాడుతూ.. నాకు గన్స్ అంటే ఎంతో పిచ్చి ఉండేది. యంగ్ గా ఉన్నప్పుడు నక్సలైట్ అయితే నేను గన్ పట్టుకుంటాను బాగుంటుంది అనిపించేది. గన్స్ కోసమే నేను నక్సలైట్ అవుదామని అనుకున్నాను. కృష్ణవంశీ సింధూరం సినిమాలో రవితేజ క్యారెక్టర్ నాదే. నాకు అప్పుడు గద్దర్ ప్రభావం కూడా ఉండేది. పనిపాట లేకుండా ఉండేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు పలు విషయాలకు యంగ్ ఏజ్ లో ఆకర్షితులం అవుతాము కాబట్టి అలా అనుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో లైసెన్స్డ్ గన్ ఉంది. గతంలో రెండు మూడు సార్లు ఫామ్ హౌస్ లో ఖాళీగా ఊరికే పేల్చాను . ఇప్పుడు అలా పేల్చకూడదని తెలిసి పేల్చట్లేదు అని అన్నాడు శివాజి రాజా.
ఇక లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ… వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లో నటించిన సంగీత బిజ్లానీని ప్రేమించానని అన్నాడు. ఆ యాడ్ చూసే వన్ సైడ్ లవ్ చేశాను. పెళ్ళికి ముందు నా రూమ్ లో అన్ని ఆమె పోస్టర్స్ ఉండేవి. సంగీత బిజ్లానీ విషయం మా ఆవిడకు తెలిసినప్పటి నుంచి ఆమె అంటే మా ఆవిడ చిరాకు పడుతూ ఉండేది. ఆమెని కలవలేనేమో అనుకున్నా కాని ఒకసారి తనని కలిసాను. క్రికెటర్ వేంకటపతి రాజు నాకు కజిన్ కాగా, ఆయనతో కలిసి హైదరాబాద్ తాజ్ బంజారాలో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడికి సంగీత బిజ్లానీ వచ్చింది. వెంకటపతికి చెప్తే నేను పరిచయం చేస్తా అని తీసుకెళ్లి పరిచయం చేసాడు. హాయ్ అంటే హాయ్ అని మాట్లాడాను అంతే. అప్పటికే నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.నేను పార్టీలకు వెళ్లను. పబ్‌లకు వెళ్లను. రెండే పెగ్‌లు తాగుతా. అది రెండు గంటలు తాగుతా. సిగరెట్లు అయితే బీభత్సంగా కాల్చేవాడ్ని. 2000 ఏడాది.. డిసెంబర్ 31 నాడు మెగాస్టార్ చిరంజీవి గారిపై ఒట్టేసి.. సిగరెట్లు తాగనని చేతిలో చేయి వేశాను అప్పటి నుండి అగ్గిపుల్ల కూడా వెలిగించలేదు అని అన్నాడు శివాజి రాజా.