‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనుదీప్. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. యువ దర్శకుడు అనుదీప్ తదుపరి చిత్రాన్ని శనివారం ప్రకటించారు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, శాంతి టాకీస్ సంస్థలు నిర్మించబోతున్నాయి. ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘లండన్, పాండిచ్చేరి నేపథ్యంలో కథ నడుస్తుంది. పూర్తి స్థాయి వినోదాత్మక కథాంశంతో ఆకట్టుకుంటుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: నారాయణ దాస్ నారంగ్, పూస్కుర్ రామ్మోహన్రావు, సురేష్‌బాబు, సహనిర్మాత: అరుణ్‌విశ్వ, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ.