Siva Karthikeyan – Sai Pallavi | కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అమరన్. ఇండియాస్ మోస్ట్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా రానుండగా.. ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్‌హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.