Sitaare Zameen Par | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంటారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం “సితారే జమీన్ పర్” . ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఆమిర్ ఖాన్ చేయని పని లేదు, ఇవ్వని ఇంటర్వ్యూ లేదు. “చాంపియన్స్” అనే స్పానిష్ సినిమా ఆధారంగా తమిళ దర్శకుడు ఆర్.ఎస్.ప్రసన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. జెనీలియా ఈ సినిమాలో ఆమిర్ సరసన నటించడం అనేది మరో విశేషంగా నిలిచింది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకొని సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు రాబడుతుంది. అయితే ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి.
ఆమిర్ ఖాన్ గత వ్యాఖ్యలను ఇప్పుడు వెలుగులోకి తీసుకు వస్తూ, సినిమా కంటెంట్ కంటే, ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం, పూర్వంలో చేసిన వ్యాఖ్యలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. పీకే సినిమాలో దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం రేగింది. శివుడిపై పాలను పోయడం కంటే బీదవారికి సహాయం చేయాలి అని అనడంతో ఇప్పుడు అదే ప్రస్తావన తెస్తూ… ఇప్పుడు ఆయన సినిమా విడుదలైంది కదా, మరి ఈ సినిమాను చూడడం కంటే ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేస్తే బాగుంటుంది అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇండియా-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావణం సమయంలో పాకిస్తాన్ తీరును సినిమా తారలు తప్పుబట్టారు. ఇండియన్ ఆర్మీ గురించి పాజిటివ్‌గా స్పందించారు. అంతేకాకుండా ఇండియా పై జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. కానీ ఆమీర్ ఖాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి కనీస బాధ్యతతో వ్యవహరించని ఆమీర్ ఖాన్ సినిమాను ఇండియన్స్ ఎందుకు ఆధరించాలంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆమీర్ ఖాన్‌కి దేశ భక్తి లేదు, ఆయన ఇతర దేశం పైనే మక్కువ చూపుతున్నట్లు ఉన్నారు అని సితారే జమీన్ పర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఆమీర్ ఖాన్ గత మూడు నాలుగు ఏళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆయన తన నిర్మాణ సంస్థకు చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉగ్ర దాడిని ఖండించడంతో పాటు, పాక్ కి వ్యతిరేకంగా ట్వీట్స్ చేసారు. ఆ విషయంలో బాయ్ కాట్ అనేది సమంజసం కాదని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆమీర్ గతంలో చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాని బాయ్‌కాట్ చేయాల్సిందేనంటూ కొందరు మండిపడుతున్నారు.