Singham Again | ‘సింగం’ నుంచి విలన్ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్‌లుక్ పోస్టర్.!
Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది.
Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా.. ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విలన్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు.
ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో పాటు అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. అర్జున్ సౌత్ సినిమాలలో కనిపించే విలన్లా కనిపిస్తున్నాడు.
Singham ka villain! Feeling on top of the world being a part of hit-machine Rohit Shetty sir’s cop universe! I promise you there will be mayhem 🚨💥😈#SinghamAgain#RohitShetty @RSPicturez @ADFFilms @jiostudios @RelianceEnt #Cinergy pic.twitter.com/H0tIxA25iV
— arjunk26 (@arjunk26) February 14, 2024
12 ఏండ్ల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

