గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి అర్థ్యా కథానాయిక. శివవరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. తధాస్తు క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
రొమాంటిక్ లవ్, సస్పెన్స్ జానర్లో ఈ సినిమా రూపొందించామని దర్శకుడు శివవరప్రసాద్ తెలిపారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాత తాటి బాలకృష్ణ చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, సుమంత్ కాచర్ల, సంగీతం: యశ్వంత్ నాగ్.