అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నది. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, దానిని ఆపేయాలని ఆమె శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసింది. ‘నేను, నా భర్త సంతోషంగా జీవిస్తున్నాం. ప్రస్తుతం నేను పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే చదువుకోగలుగుతున్నా. మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నిద్రలేమికి చికిత్స తీసుకుంటున్నా. మాత్రలు ఓవర్డోస్ కావడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం వల్ల నేను మీ ముందున్నా. నా జీవితానికి ఓ వరం నా భర్త. త్వరలో నా పాటలతో మిమ్మల్ని అలరిస్తాను’ అని కల్పన వీడియోలో చెప్పింది.