Singer kalpana | అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ మహిళా కమిషన్కు గాయని కల్పన ఫిర్యాదు చేసింది.
వాస్తవాలను తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఆపాలని తెలంగాణ మహిళా కమిషన్ని కోరింది కల్పన. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదును అందించింది కల్పన.