తమిళ హీరో శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ‘అరసన్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో శింబు అత్యంత పవర్ఫుల్గా కనిపిస్తున్నారు.
శింబు, వెట్రిమారన్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయని, శింబు కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.