Silambarasan TR | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకడు శింబు (Silambarasan TR). ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్ (Kamalhaasan), లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తోన్న ‘థగ్ లైఫ్’ (Thug life)లో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. KH234 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శింబు డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో STR48కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు మరో కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. STR 49 చిత్రాన్ని 2018 ఫేం, మలయాళ దర్శకుడు జ్యూడ్ జోసెఫ్ ఆంటోనీ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇన్సైడ్ టాక్. మిడ్ సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ షురూ కానుండగా.. ఏజీఎస్, దిల్ రాజు ఈ చిత్రాన్ని రూ. 150-180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి దీనిపై దిల్ రాజు, శింబు అండ్ టీం అధికారిక ప్రకటన ఏమైనా జారీ చేస్తుందా.. అనేది చూడాలి.
శింబు థగ్‌లైఫ్ సినిమా కోసం మొత్తం 60 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని ఇప్పటికే వార్త ఒకటి బయటకు వచ్చింది. మరి STR48, STR49 సినిమాలకు సంబంధించిన కొత్త అప్డేట్ ఏమైనా అందిస్తాడేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. థగ్ లైఫ్‌లో శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ విడుదల చేసిన Sigma Thug Rule వీడియోలో తన మార్క్ చూపించేందుకు ఇన్నోవాలో కొత్త క్రిమినల్ రూపంలో పిస్తోల్ చేతబట్టుకొని శింబు స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
– #STR next joins a Malayalam director
– #SilambarasanTR will next be seen in a big budget film directed by #JudeAnthonyJoseph “2018”✔️
– The shooting of this film will begin in mid-Sep this year
– 150-180 Cr
– AGS & Dill Raju are most likely to produce pic.twitter.com/ojmCehopZd— TamilDelight (@TamilDelight) July 29, 2024
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!
Double ISMART | డబుల్ ఇస్మార్ట్ రొమాంటిక్ మెలోడీగా రామ్, కావ్య థాపర్ Kya Lafda సాంగ్
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్