Salman Khan – AR Murugadoss | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సికందర్ (Sikandar). ఈ సినిమాకు తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్ అగర్వాల్, రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది.
ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి హోలీ పండుగ కానుకగా భం భం భోలే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ తన స్టెప్పులతో అలరించగా.. ఈ సాంగ్‌లో రష్మికతో పాటు కాజల్ అగర్వాల్ తళుకున్న మెరిశారు.