SIIMA | దుబాయ్ లో సైమా హంగామా ఓ రేంజ్లో ఉంది. శుక్రవారం, శనివారాల్లో ఈ వేడుకని ప్లాన్ చేయగా, తొలి రోజు తెలుగు, కన్నడ భాషలకి చెందిన నటీనటులు అవార్డ్లు సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా తో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, రష్మిక మందన్నా సైమా వేడుకల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ కానున్నారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి అవార్డ్ దక్కగా, ఉత్తమ నటిగా రష్మిక అవార్డ్ తీసుకున్నారు. ఇక ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డులు చేజిక్కించుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి చిత్రం నిలిచింది.పుష్ప2, కల్కి చిత్రాలకి ఎక్కువ అవార్డులు దక్కడం విశేషం.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చాలా మంది స్టార్స్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషా చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందచేసి సత్కరించే సైమా వేడుకల్లో ఇప్పుడు జరగుతున్నది 13వ ఎడిషన్. అయితే ఈ వేడుకలలో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డును తేజ (హనుమాన్) దక్కించుకున్నారు. ఇక బెస్ట్ యాక్టర్ ఫిమేల్ డిబ్యూటెంట్ అవార్డును భాగ్యశ్రీ గెలుచుకుంది.
సైమా అవార్డ్స్ 2025 విజేతల జాబితా చూస్తే..
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (పుష్ప2)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీప్రసాద్ (పుష్ప2)
బెస్ట్ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి (దేవర-చుట్టమల్లే)
బెస్ట్ కమెడియన్: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
ఉత్తమ గాయని: శిల్పారావ్ (దేవర-చుట్టమల్లే)
ఉత్తమ పరిచయ నటి: భాగ్య శ్రీ బోర్సే ( మిస్టర్ బచ్చన్)
ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల ( కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : తేజ సజ్జా( హనుమాన్)
ఉత్తమ నటి ( క్రిటిక్స్) : మీనాక్షి చౌదరి ( లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు ( క్రిటిక్స్ ) : ప్రశాంత్ వర్మ ( హనుమాన్)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీదత్ ( వైజయంతీ మూవీస్)