Janhvi Kapoor | తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor). దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హిందీతోపాటు తెలుగు భాషలో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ కాంబోలో వస్తోన్న చిత్రం పరంసుందరి (ParamSundari).
దినేశ్ విజన్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి తుషార్ జలోట దర్శకత్వం వహిస్తున్నాడు. మధురమైన పరం, ఉల్లాసమైన సుందరిని కలవండి.. అంటూ రిలీజ్ అప్డేట్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2025 జనవరి 25న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తరాది స్వాగ్, దక్షిణాది గ్రేస్.. రెండు ప్రపంచాలు ఢీకొట్టి.. నిప్పురవ్వలు ఎగిరిపడితే అంటూ విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న సిద్దార్థ్ మల్హోత్రా జాన్వీకపూర్‌ను ఎత్తుకొని వస్తున్న విజువల్స్ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. ప్రేమ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇంకేంటి మరి త్వరలోనే సినిమాను చూసేందుకు రెడీగా ఉండండి మరి. మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్‌పై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు.
North ka swag, South ki grace – two worlds collide and sparks fly. 💕✨
Dinesh Vijan presents #ParamSundari, a love story directed by Tushar Jalota, coming to cinemas on 25th July 2025.
Meet the suave Param and the vivacious Sundari. 🫶#JanhviKapoor #DineshVijan @TusharJalota… pic.twitter.com/55Wa2ORdKf
— Sidharth Malhotra (@SidMalhotra) December 24, 2024
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ