టిల్లు పాత్ర సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది. ‘డీజే టిల్లు’ ‘టిల్లు స్కేర్’ చిత్రాలు భారీ హిట్స్‌గా నిలిచాయి. సిద్ధు జొన్నలగడ్డతో ఈ రెండు చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ఆయనతో ‘బ్యాడాస్’ పేరుతో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తారు. బుధవారం టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
‘ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ ఏ మ్యాన్’ అనే బోల్డ్ స్టేట్మెంట్తో పోస్టర్ ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో కనిపిస్తారని, పరిణితితో కూడిన పాత్ర ఇదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, రచన: రవికాంత్ పేరేపు, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకత్వం: రవికాంత్ పేరేపు.