Siddhu Jonnalagadda | సిద్ధు జొన్నలగడ్డ తన హిట్ స్ట్రీక్‌తో టాలీవుడ్లో యూత్ ఐకాన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వచ్చిన జాక్ సినిమా మాత్రం తీవ్ర నిరాశని మిగిల్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే హీరోగా సిద్ధు ఆ బాధ్యతను తానే మోసాడు. తన రెమ్యునరేషన్లో భారీ మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చినట్టు తాజాగా సిద్ధు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నేను లోన్ తీసుకుని రూ. 4.75 కోట్లు తిరిగి ఇచ్చాను. ఇంకా ఆ లోన్ కడుతున్నా అని చెప్పిన ఆయన మాటలు ప్రేక్షకులను టచ్ చేశాయి. ఫ్లాప్ అయినా నిర్మాత బాధను చూసి సపోర్ట్‌గా నిలబడిన సిద్ధు ఉదారతకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకుని ఎవరు సినిమా చేయరు. కానీ నష్టాల్లో ఉన్న నిర్మాతకు నా వంతుగా చేయాల్సినది చేశాను అని సిద్ధు జొన్నలగడ్డ స్పష్టం చేశారు. ఫ్లాప్ తర్వాత సిద్ధు, తన “టిల్లు బోయ్” ఇమేజ్ నుంచి బయటకు వచ్చేందుకు “తెలుస్తు కదా” సినిమాతో వస్తున్నాడు. నీరజ్ కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది.
శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కథానాయికగా రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రేజీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. టిల్లు ఫ్లేవర్ కాకుండా, పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా సిద్ధు కనిపించనున్నాడు. “తెలుసు కదా” తర్వాత సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా సైన్ చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం.