Jack OTT | యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్‌లైన్. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి (Jack OTT) వచ్చేందుకు సిద్ధమైంది. మే 8వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ఎక్స్ ఖాతాలో తాజాగా పోస్ట్ పెట్టింది.
Pablo Neruda, peru poetic ga unna profession maathram confidential 🤫🤭
Watch Jack on Netflix, out 8 May in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam#JackOnNetflix #JackTheMovie pic.twitter.com/WeeWmAqY7B— Netflix India South (@Netflix_INSouth) May 5, 2025
డీజే టిల్లుతో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఆ తర్వాత టిల్లు స్క్వేర్ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం జాక్(Jack). బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. బేబి సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించిన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది.
కథ గురించి: జాక్ అలియాస్ పాబ్లో నెరోడా (సిద్దు జొన్నలగడ్డ) చాలా తెలివైన కుర్రాడు. చిన్నప్పటి నుంచి ఏవోవో కావాలని కలలు కంటుంటాడు. కానీ ఏది కూడా రూల్ ప్రకారం చేయడు. తనకంటూ ఒక సేఫరేట్ స్టయిల్ పెట్టుకుంటాడు. తనకి సాధారణమైన పని చేయడం ఇష్టం వుండదు. ‘రా’ ఏజెంట్ కావాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్తాడు. అయితే జాబ్ వచ్చేలోపే దేశాన్ని కాపాడే ఓ మిషన్ లో భాగంగా ఉగ్రవాదులు వెంటపడతాడు. తీవ్రవాదిని వెదుక్కుంటూ నేపాల్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో మనోజ్ (ప్రకాష్ రాజ్), రెహ్మాన్ (రాహుల్ దేవ్), ఆప్షాన్ బేగం (వైష్ణవి చైతన్య) ఎవరు? చివరి జాక్ మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా? అనేది మిగతా కథ.
Also Read..
Ajaz Khan | బాలీవుడ్ నటుడిపై అత్యాచారం కేసు
Anvesh | ప్రపంచ యాత్రికుడిపై పోలీస్ కేసు.. స్పందించిన అన్వేష్