Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టైల్‌కి, డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 74 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్న రజనీకాంత్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రజనీకాంత్ గత కొన్ని నెలలుగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 అనే చిత్రం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళ సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇందులో బాలయ్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కాని క్లారిటీ లేదు. ఇక రజజినీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ ఆగస్టు 15, 2025న విడుదల కానుంది. ఇక జైలర్ 2 విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. 74 ఏళ్ల ఈ నటుడు ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్‌లు ఏమి ప్రకటించలేదు. మణిరత్నంతో జతకట్టనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి కాని క్లారిటీ లేదు. ఇక సినిమాలకి విరామం తీసుకుంటాడని టాక్స్ వినిపిస్తున్న సమయంలో ఒక విలేకరి రజనీకాంత్ భార్య లతను అడిగినప్పుడు, నాకు సమాధానం తెలిస్తే బాగుండేది. నేనే మీకు చెప్పేదాన్ని అని సమాధానం ఇచ్చారు. దీంతో రజనీకాంత్ రిటైర్మెంట్ అంశం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
రజనీకాంత్ ఆ మధ్యలో కాస్త అనారోగ్యానికి గురై రాజకీయాల నుండి కూడా తప్పుకోవడం మనం చూశాం. కొత్త పార్టీ పెట్టి రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ సృష్టించాలని అనుకున్నారు. కాని అనారోగ్యం వలన తప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా పెద్ద హిట్ కాగా, ఇప్పుడు జైలర్ 2 చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందని విశ్వసిస్తున్నారు.జైలర్ మొదటి భాగంలో ఉన్న కళాకారులే రెండో పార్ట్లోను కొనసాగుతున్నారు. రమ్య కృష్ణ జైలర్ రజనీకాంత్ భార్య పాత్రను కూడా పోషిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ పార్ట్-2 సినిమాలో కూడా తన మొదటి భాగం కథను కొనసాగించాడు.