టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా (Ori Devuda). ఇప్పటికే విడుదలైన సర్ ప్రైజ్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను పాట రూపంలో అందించారు.
ఓరి దేవుడా నుంచి ‘అవుననవా’ సాంగ్ (Avunanavaa Music Video) విడుదల చేశారు. ‘ఏమని అనాలని తోచని క్షణాలివి..ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా..? ఆమని నువ్వేనని..నీ జత చేరాలని..ఏ తలపో మొదలయ్యే మౌనమిదా..అవుననవా..అవుననవా..’అంటూ అద్భుతమైన భావాలతో సాగుతున్న ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా..లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.
అశ్వత్ మారిముత్తు తమిళంలో డైరెక్ట్ చేసిన ఓ మై కడవులేకు తెలుగు రీమేక్‌గా ఓరి దేవుడా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో వెంకటేశ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ కీ రోల్లో నటిస్తున్నాడు.