అరవింద్‌కృష్ణ, శ్రీజితాఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకుడు. అయ్యన్న నాయుడు, తేజ నిర్మాతలు ఈ నెల 23న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మైండ్‌గేమ్ ప్రధానంగా సాగే చిత్రమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. అరవింద్కృష్ణను విభిన్న కోణంలో ఆవిష్కరిస్తుంది’ అన్నారు. ‘ప్రేమ, నేరం, ప్రతీకారం ప్రధానాంశాలు సాగే చిత్రమిది. నా కెరీర్లో ఈ సినిమాను సెకండ్ ఇన్సింగ్స్లా భావిస్తున్నా’ అని అరవింద్‌కృష్ణ తెలిపారు.