తెలుగులో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది చెన్నై సొగసరి శృతిహాసన్. ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శృతిహాసన్ తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నది. నాని నటిస్తున్న 30వ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మృణాల్ ఠాకూ ర్ కథానాయికగా నటిస్తున్నది. ప్రస్తుతం గోవా లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ షూ టింగ్‌లో శృతిహాసన్ జాయిన్ అయిందని చిత్రబృందం పేర్కొంది. వైర ఎంటర్టైన్మెం ట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న విడుదలకానుంది.