Shruti Haasan | కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంతో మంచి హిట్ కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న శృతి సింగర్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా.. హీరోయిన్గా కూడా సత్తా చాటుతోంది. సినిమాల్లో సక్సెస్ బాగానే ఉన్నా.. నిజ జీవితంలో రిలేషన్ల విషయంలో మాత్రం బొక్క బోర్లా పడింది. ఇప్పటి వరకు ముగ్గురితో ప్రేమాయణం నడిపింది. ఆ మూడు లవ్ స్టోరీలు ఫెయిల్యూర్ అయ్యాయి. సినిమాల కన్నా కూడా శృతి హాసన్ ఈ మూడు రిలేషన్స్‌తోనే ట్రెండింగ్‌లో నిలిచింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి హాసన్.. నేను నా రిలేషన్స్‌లో చాలా నిజాయితీగా ఉన్నాను. ఆ రిలేషన్స్ ఫెయిల్ అయినపుడు నా లవర్స్‌ను తప్పుబట్టడం లేదు కాని నా బ్రేకప్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. అవి నా ఎదుగుదలకు ఉపయోగపడతాయి అంటూ ఉపోద్ఘాతం చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూలో తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా మాట్లాడింది. మా అమ్మానాన్న విడిపోయిన తర్వాత నా జీవితం తల్లకిందులు అయిపోయింది. చెన్నై నుంచి ముంబై వెళ్లి అక్కడ ఎన్నో బాధలు పడ్డాము. మెర్సెండెస్ బెంజ్ కారులో తిరిగే మాకు లోకల్ ట్రైన్లో తిరిగే పరిస్థితి వచ్చింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది శృతి హాసన్.
ఇక శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. శృతి ఏదో ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు పేర్కొంది. కాని తనకు వచ్చిన వ్యాధి ఏంటో మాత్రం రివీల్ చేయలేదు. శృతి పెట్టిన పోస్ట్ మాత్రం అభిమానులని తెగ కంగారు పెట్టేస్తుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే త్వరగా కోలుకోవాలి అని ప్రార్ధిస్తున్నారు. కాగా, శృతి హాసన్ ఈ మధ్య సలార్ అనే చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన విషయం విదితమే.