Shruti haasan | కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ చాలా ఓపెన్‌గా ఉంటుంది. ఏ విషయంపైనైన కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో సలార్ 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది. ఈ అమ్మడు తాజాగా తన తల్లిదండ్రుల విడాకులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తండ్రి కమల్ హాసన్ మరియు తల్లి సారిక విడిపోవడం గురించి శృతి మాట్లాడుతూ .. నా చిన్నప్పుడే వారు విడిపోయారు. అందుకు నేను బాధపడలేదు. కలిసి ఉండి బాధపడే బదులు, విడివిడిగా సంతోషంగా ఉండడమే మంచిదని నాకు అనిపించింది అని శృతి హాసన్ కామెంట్ చేసింది.
విడాకుల తర్వాత తనతల్లి సారిక ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్న తీరు నాకు ప్రేరణగా నిలిచింది..ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో నేను అమ్మ జీవితాన్నే చూసి నేర్చుకున్నాను. ఇది నన్ను జీవితంలో స్వతంత్రంగా బతకేలా తయారుచేసింది అంటూ తన భావాలను వ్యక్తపరిచింది శృతి. తల్లిదండ్రులుగా విడిపోవడం వారి వ్యక్తిగత జీవితం కోసం తీసుకున్న నిర్ణయమని, దాన్ని తాను గౌరవిస్తానని శృతి స్పష్టం చేసింది. వారిద్దరితో తాను మంచి రిలేషన్ కొనసాగిస్తున్నట్టు పేర్కొంది శృతి హాసన్. ఇక శృతి హాసన్ తరచూ తన తండ్రి కమల్ హాసన్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుందని చెప్పింది.
ఇటీవలి కాలంలో శృతి హాసన్ తెలుగు ఇండస్ట్రీలో సలార్ వంటి బ్లాక్‌బస్టర్‌లో ప్రభాస్ సరసన నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా సలార్ 2 తెరకెక్కుతోంది, ఇందులో శృతి కథానాయికగా కనిపించి అలరించనుంది. ఇటీవల శృతి హాసన్.. తన తండ్రి నటించిన థగ్ లైఫ్ సినిమాలో ఓ పాట పాడి శ్రోతలని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.