అదే కెరీర్ టర్నింగ్ పాయింట్
గత రెండేళ్లుగా తమిళ సోయగం శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతున్నది. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్లో బాగా గుర్తుండిపోతుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ఇటీవలే విడుదలైన ‘సలార్-1’ చిత్రంతో మూడు భారీ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది.
గత రెండేళ్లుగా తమిళ సోయగం శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతున్నది. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్లో బాగా గుర్తుండిపోతుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ఇటీవలే విడుదలైన ‘సలార్-1’ చిత్రంతో మూడు భారీ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. అయితే తెలుగులో తన కెరీర్‌ను ‘గబ్బర్‌సింగ్’ మలుపుతిప్పిందని..అక్కడి నుంచి భారీ విజయాలు దక్కడం మొదలైందని చెప్పింది శృతిహాసన్.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ “గబ్బర్‌సింగ్’కు ముందు నా కెరీర్ వేరుగా ఉండేది. ఆ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ నిచ్చింది. కెరీర్లో తిరుగులేని కమర్షియల్ విజయాన్ని అందించింది. ఓ రకంగా ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. అంతకుముందు కూడా నేను చాలా హార్డ్‌వర్క్ చేశాను. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాతే నా కెరీర్ ట్రాక్‌లో పడింది’ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఎప్పుడో పదకొండేండ్ల క్రితం విడుదలైన ‘గబ్బర్‌సింగ్’ సినిమా గురించి శృతిహాసన్ ఇప్పుడు మాట్లాడటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

