Shriya Saran | తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రముఖ నటి శ్రియా మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంది. బుధవారం వేకువజామున జరిగిన సుప్రభాత సేవలో శ్రియా పాల్గొనగా, ఆలయ ప్రాంగణంలో ఆమెను చూసిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కుమార్తె రాధ శరణ్‌ని ఎత్తుకుని, తల్లి నీరజతో కలిసి, సుప్రభాత సేవలో పాల్గొంది. సేవ అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రియాకు ఆశీర్వచనాలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో దర్శనానికి వచ్చిన శ్రియా, ఆలయం ముందు భక్తులని చూసి సరదాగా కొందరిని పలకరించింది.
అందాల భామ శ్రియ శరణ్ . తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ ఆమె తక్కువ సమయంలోనే భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. అందం, అభినయంతోపాటు కథక్ డ్యాన్సర్ గానూ శ్రియ ఫేమస్. 2018లో తన ప్రియుడు ఆండ్రీ కోస్కివ్ ను వివాహం చేసుకున్నారు శ్రియా. వీరికి రాధ అనే కూతురు ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. కథానాయికగా కాకుండా పలు పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తిరుమల విషయానికి వస్తే భక్తుల విరాళాల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన భక్తురాలు సౌమ్య టీటీడీకి రూ. 1 కోటి విరాళాన్ని అందించారు.రూ. 50 లక్షలు – ఎస్వి ప్రాణదానం ట్రస్ట్‌కు, రూ. 50 లక్షలు – ఎస్వి అన్నదానం ట్రస్ట్‌కు అందించారు. సౌమ్య తన విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందజేశారు.మరోవైపు తిరుమల శ్రీవారికి మరో ప్రత్యేక విరాళం అందింది. భక్తులు రెండు కార్లను డొనేట్ చేశారు. రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారు అందించారు. విరాళదాత: చెన్నైకి చెందిన శరవణన్ కరుణాకరన్ అని తెలుస్తుంది.