తన ఖాతాలో బాలీవుడ్ హిట్స్ ఉన్నప్పటికీ.. బీటౌన్ మీడియా తనను ‘సౌత్ హీరోయిన్’ అనే పిలుస్తుంటుందని సీనియర్ నటి శ్రియా శరణ్ అసహనం వ్యక్తం చేసింది. అయితే, అలా పిలవడం తనకెప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదనీ, దక్షిణాది ప్రేక్షకులు తనపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిదని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్.. తాజాగా, ‘స్పేస్జెన్: చంద్రయాన్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చిన్ననాటి జ్ఞాపకాలతోపాటు తన సినీ ప్రయాణాన్నీ గుర్తు చేసుకున్నది.
తనను ముంబై మీడియా తనను ‘సౌత్ ఇండియన్ హీరోయిన్’గా అభివర్ణించడంపైనా ఆసక్తికర కామెంట్స్ చేసింది. “నేను హరిద్వార్‌లో పుట్టాను. 17 ఏళ్ల వయసులో కథక్ నేర్చుకోవడానికి ఢిల్లీకి మారాను. అదే నా జీవితానికి అతిపెద్ద మలుపు” అంటూ చెప్పుకొచ్చింది. తమ కుటుంబం ఎంతో క్రమశిక్షణగా ఉండేదనీ, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన తను.. నటిని అవుతానంటే అందరూ షాక్‌కు గురయ్యారని వెల్లడించింది.
“ఢిల్లీ లాంటి మెట్రో నగరానికి మారడం, అక్కడి లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకోవడం.. నన్ను ఈ ప్రపంచానికి సిద్ధం చేశాయి” అని చెప్పుకొచ్చింది. 2001లో ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది శ్రియా. రెండో సినిమాకే అగ్రహీరో నాగార్జున సరసన చాన్స్ కొట్టేసింది. ‘సంతోషం’ సినిమాతో మరో హిట్ కొట్టేసింది.
ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్, నేనున్నాను, అర్జున్, బాలు, ఛత్రపతి, శివాజీ.. ఇలా అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రియా.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తాజాగా, ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో.. శాస్త్రవేత్త పాత్రను పోషించింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్.. రికార్డు వ్యూస్ కొల్లగొడుతున్నది.