Shraddha Kapoor | మనం ఏది ఇస్తే, అదే మనకు తిరిగి వస్తుందంటారు. అదే కర్మసిద్ధాంతం. శ్రద్ధాకపూర్ ఈ విషయాన్ని బాగా అవగతం చేసుకుంది. అందుకే అభిమానులకు కావల్సినంత ప్రేమను పంచుతుంది. వాళ్లు కూడా అంతే ప్రేమను తిరిగి తనకిస్తుంటారు. రీసెంట్గా తన పుట్టినరోజును కూడా అభిమానులతో కలిసి జరపుకుంది శ్రద్ధా. ఫ్యాన్స్‌తో తను ఇంటరాక్ట్ అయ్యే తీరు చూసే ఏమో.. ముంబయ్‌లో జరిగిన ఓ అవార్డు వేడుకలో ‘మోస్ట్ ైస్టెలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్‌స్టార్’ బిరుదుతో శ్రద్ధను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘స్టార్డమ్ శాశ్వతంగా ఉండదు. అందుకే సామాన్యురాలిగా బతకడం బెస్ట్. ఇప్పటికీ నాకు కావాల్సింది నేనే స్వయంగా మార్కెట్‌కెళ్లి తెచ్చుకుంటాను. తినాలనిపిస్తే, రోడ్డు పక్కన అందరితో నిలబడి పావ్‌బాజీ తింటాను. అందులోనే నాకు ఆనందం ఉంది. రేపు ఈ స్టార్డమ్ లేనిరోజు ఒకటి వస్తుంది. అప్పుడు నా తోటి స్టార్లందరి కంటే నేను హ్యాపీగా ఉంటాను.’ అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్.