‘ఛావా’ సినిమాతో బాలీవుడ్ సినిమాకు జవసత్వాలను అందించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. మహరాష్ట్ర యోధుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 700కోట్ల వసూళ్లను రాబట్టి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నది. అంతటి విజయం తర్వాత లక్ష్మణ్ ఉటేకర్ నుంచి వచ్చే సినిమా అంటే.. అంచనాలు సహజం. తాజా సమాచారం ప్రకారం నెక్ట్స్ ఆయన ఓ బయోపిక్ చేయబోతున్నారట.
మహారాష్ట్రకు చెందిన ఫోక్ డాన్సర్ వితాబాయి భౌమాంగ్ నారాయణం గవాస్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఈ పాత్ర కోసం ఆయన శ్రద్ధాకపూర్ని ఎంపిక చేశారట. ఆ పాత్రకోసం శ్రద్ధ కసరత్తులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.
వితాబాయి వివరాలతోపాటు, ఆమె డాన్స్ గురించీ, అప్పటి సంగీతం గురించీ తెలుసుకునే పనిలో ఉందట శ్రద్ధాకపూర్. వితాబాయి జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు చాలా ఉన్నాయనీ, వాటిని జనరంజకంగా చూపించేందుకు లక్ష్మణ్ ఉటేకర్ సిద్ధమయ్యారనేది బీటౌన్ టాక్. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు లక్ష్మణ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నదట.