Shraddha Kapoor | ‘స్త్రీ2’ విజయంతో మంచి జోష్ మీద ఉన్నది బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినీ రచయిత రాహుల్‌తో రిలేషన్లో ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి అనే అంశాల గురించి శ్రద్ధా కపూర్ మాట్లాడటం చర్చనీయాంశమైంది.
‘పెళ్లి ముఖ్యం కాదు. బంధమే ముఖ్యం. సరైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటే జీవితం అందంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తితో సమయాన్ని గడపటం నాకిష్టం. కలిసి డిన్నర్‌కి వెళ్లడం, సినిమాలు చూడటం, ప్రయాణాలు చేయడం.. అవన్నీ నాకెంతో సంతోషాన్నిస్తాయి.’ అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధాకపూర్. శ్రద్ధ మాట్లాడిన ఈ మాటలన్నీ రాహుల్‌ని ఉద్దేశించే అనీ పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలావుంటే.. రీసెంట్గా రాహుల్‌ని తన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది శ్రద్దా.