Shraddha Kapoor | బాలీవుడ్ స్టార్ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శక్తికపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఇక శ్రద్ధా నటించిన ఆషికి-2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యింది.
తాజాగా ఈ సాహో భామ తన ఫ్రెండ్ పెళ్లి (Friend Wedding)లో సందడి చేసింది. శ్రద్ధా ఫ్రెండ్ నికితా మేనన్ వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వివాహానికి హాజరైన శ్రద్ధా అక్కడ సందడి చేసింది. పింక్ కలర్ దుస్తులు ధరించి.. తోటి ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ (Dance)తో దుమ్మురేపింది. డప్పు వాయిద్యాల ముందు హుషారైన స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Hanuman Movie | ‘హనుమాన్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సమంత
Yatra Movie | ‘యాత్ర 2’ నుంచి ‘చూడు నాన్న’ సాంగ్ రిలీజ్