Hanuman Movie | ‘హనుమాన్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సమంత
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది.
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుందని, వీఎఫ్ఎక్స్, విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మూవీపై ప్రశంసల వర్షం కురిపించింది.
మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే సినిమాలు ఎంతో ఉత్తమమైనవి. హనుమాన్‌లో అద్భుతమైన విజువల్స్, సూపర్ కామెడీ, మ్యాజిక్, అద్భుతమైన మ్యూజిక్ అన్నీ ఎంతో బాగున్నాయి. థాంక్యూ ప్రశాంత్ వర్మ.. నీ యూనివర్స్ నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. తేజా సజ్జా నీ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచావు. హనుమంతుడి పాత్ర ఈ మూవీకి హార్ట్. ఇందులో నటించి హిట్ అందుకున్న నటినటులకు శుభాకాంక్షలు అని సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
Samantha about #Hanuman movie#HanuManRAMpage #HanumanReview #SamanthaRuthPrabhu pic.twitter.com/QzjVHv17uo
— Aryan (@chinchat09) January 19, 2024
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అంజనాద్రి అనే ఊహ ప్రాంతం. ఆ వూర్లో హనుమంతు (తేజాసజ్జా) ఒక మామూలు కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు. అనుకోని సంఘటనతో హనుమంతుకి కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తుల గురించి తెలుసుకున్న మైఖెల్ (వినయ్‌రాయ్) అంజనాద్రి వస్తాడు. హనుమంతు వద్ద శక్తులని తన వశం చేసుకొని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు కావాలనుకుంటాడు. మరా ఆ శక్తిని వశం చేసుకోవడానికి మైఖెల్ ఏం చేశాడు? మైఖేల్ వలన అంజనాద్రికి ఎలాంటి ముప్పు వాటిల్లింది ? హనుమంతు మైఖేల్ ని ఎలా అడ్డురుకున్నాడు ? అనేది తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

