Yatra Movie | ‘యాత్ర 2’ నుంచి ‘చూడు నాన్న’ సాంగ్ రిలీజ్
Yatra 2 | ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది.
Yatra 2 | ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు, టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ‘చూడు నాన్న లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జగన్ చేపట్టిన ఓదర్పుయాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండగా ఫుల్ ఎమోషనల్‌గా ఈ పాట సాగింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకుర్చాడు.
వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం ఇలా ప్రతిది 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయాల చుట్టూ ఈ సినిమా సాగనుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

