Shraddha Kapoor | నీలి రంగు చీరలోన సందమామా నీవే జాణ.. శ్రద్దాకపూర్‌కు నెటిజన్లు ఫిదా
నెట్టింట చురుకుగా ఉండే ముంబై భామ శ్రద్దాకపూర్ (Shraddha Kapoor) ప్రస్తుతం సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ ఔరా అనిపిస్తోంది. నీలి రంగు చీరలోన సాంగ్‌ను నా కోసమే రాశారు అన్నట్టుగా నీలి రంగు చీర (Blue Saree)లో మెరిసిపోతుంది.
ఆషికి 2 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది ముంబై భామ శ్రద్దాకపూర్ (Shraddha Kapoor). బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒకే జాను, చిచోరే, ఏక్ విలన్‌తోపాటు మరెన్నో చిత్రాల్లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ ప్రస్తుతం సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ ఔరా అనిపిస్తోంది.
నీలి రంగు చీరలోన సందమామా నీవే జాణ.. ఎట్ట నిన్ను అందుకోనే.. ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా..నిన్ను ఎట్టా అదుముకోనే.. మెరుపల్లె మెరిసే జాణ.. వరదల్లె ముంచె జాణా.. ఈ భూమిపైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణా.. అంటూ సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ సాంగ్‌ను నా కోసమే రాశారు అన్నట్టుగా నీలి రంగు చీర (Blue Saree)లో మెరిసిపోతుంది బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్.
ఈ బ్యూటీ కాటుక కండ్లతో కట్టిపడేస్తూ.. జాలువారుతున్న కురులతో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. కంప్లీట్ బ్లూ కాస్ట్యూమ్స్ లో నడుమందాలు చూపిస్తూ.. హొయలు పోతూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్దిగా మోడ్రన్ టచ్ ఇస్తూ.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న శ్రద్దాకపూర్ స్టిల్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రద్దాకపూర్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి Tu Jhoothi Main Makkaar సినిమాలో నటిస్తోంది.
శ్రద్దాకపూర్ అందాలపై ఓ లుక్కేయండి మరి..
Blue crush!💙✨#ShraddhaKapoor stuns in her latest look. pic.twitter.com/tXdcsvIIYi
— Filmfare (@filmfare) February 28, 2023
Tu Jhoothi Main Makkaar ప్రమోషన్స్ లో ఇలా..
Shraddha Kapoor at the sets of
Indian Idol for TJMM promotions. 😍❤#TuJhoothiMainMakkaar pic.twitter.com/wnbEYzgCkG— Team Shraddha Kapoor (@TeamShraddhaKPR) February 27, 2023
Tu Jhoothi Main Makkaar ట్రైలర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

