కరోనా తర్వాత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోయాయి. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. మరోవైపు చిత్ర నిర్మాణ వ్యయాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలివి.
ఈ నేపథ్యంలో రెగ్యులర్గా సినిమాలు చేస్తున్న పలువురు నిర్మాతలు (యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్) హైదరాబాద్లో మంగళవారం సమావేశమై ఈ సమస్యలపై చర్చించారు.
ఈ చర్చల్లో భాగంగా ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని వారు నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులపై మరింత లోతుగా చర్చించి, ఒక ఉమ్మడి పరిష్కారానికి వచ్చే వరకు చిత్రీకరణలు నిలిపివేయడమే సరైనదని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే విడుదలకు సిద్ధంగా సినిమాలు రిలీజ్కు వెళ్లవచ్చు.
నిర్మాతల నిర్ణయంతో ఇప్పుడు సెట్స్ మీద ఉన్న పలువురు స్టార్స్ సినిమాల ఆగిపోనున్నాయి. ఇందులో చిరంజీవి నటిస్తున్న భోళా దర్శకుడు బాబీ మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, అ ల్లు అర్జున్ పుష్ప2, బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా, మహేష్ బాబు త్రి విక్రమ్కాంబినేషన్ మూ వీ, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఉన్నాయి.