హవీష్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. నిఖిల కోనేరు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నది. సోమవారం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో కీలక టాకీ పార్ట్ షూటింగ్ మొదలైంది. ప్రధాన తారాగణమంతా ఈ షూట్లో పాల్గొన్నారు. త్రినాథరావు నక్కిన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా ఉంటుందని, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమాను తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం చెబుతున్నది. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్, అజయ్, మురళీధర్‌గౌడ్, గోపరాజు విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి.