ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ కలయికలో రూపొందనున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారంలో షూటింగ్ మొదలుకానుంది. ఈ షూట్లో తారక్ కూడా జాయిన్ అవుతారని సమాచారం. తాజాగా వినిపిస్తు న్న అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ను ప్రశాంత్‌నీల్ ప్లాన్ చేశారట. ఆ సాంగ్ షూట్ తోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తున్నది.
ఎన్టీఆర్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాను నిలపాలని ప్రశాంత్‌నీల్ ప్రయత్నం చేస్తున్నారు. స్క్రిప్ట్ కోసం ఆయన ఎక్కువ సమయం తీసుకోడానికి కారణం కూడా అదే. తారక్ కెరీర్లోనే ఇది బెస్ట్ స్క్రిప్ట్ అని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా గురించి ప్రశాంత్‌నీల్ మాట్లాడుతూ ‘తారక్‌పై అభిమానంతో రాసుకున్న స్క్రిప్ట్ ఇది. ఆడియన్స్ ఊహించని స్థాయిలో సినిమా తీస్తా.’ అని చెప్పారు. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్.