Naga Chaitanya Thandel Movie | నటుడు అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటించగా.. చందు మొండేటి దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య గత ఏడాది నుంచి కష్టపడుతున్న విషయం తెలిసిందే.
కొన్నిరోజులు అయితే గడ్డం కూడా తీయలేదు. విషయం ఏంటి అంటే తన పెళ్లి రోజు కూడా నాగ చైతన్య గడ్డంతోనే దర్శనమిచ్చాడు. అయితే తాజాగా తన సినిమా తండేల్ రిలీజ్ అవ్వడంతో చైతూ గడ్డం(Naga Chaitanya Beard) తీసినట్లు తెలుస్తుంది. దీంతో తన భర్త ఫేస్‌ని మొదటిసారి గడ్డం లేకుండా చూసిన శోభితా ఇన్‌స్టా వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టింది.
తండేల్ మేకింగ్ సమయంలో నువ్వు చాలా ఫోకస్‌గా, పాజిటివ్‌గా ఉండడం నేను చూశాను. ఈ ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితోపాటు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటి సారి నీ ముఖ దర్శనం అవుతుంది సామీ అంటూ రాసుకోచ్చింది. అయితే దీనికి నాగచైతన్య స్పందిస్తూ.. థాంక్యూ బుజ్జితల్లి అంటూ రాసుకోచ్చాడు.