Shloka | ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న సంస్కృత చిత్రం ‘శ్లోక’. జనార్ధన మహర్షి కుమార్తెలైన శ్రావణి, శర్వాణి ఈ చిత్రానికి నిర్మాతలు. రాగిణి ద్వివేది ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి జనార్ధన మహర్షి మాట్లాడుతూ ‘స్మశానంలోకి వెళ్లి ప్రకృతి ఆకృతితో మాట్లాడే ప్రత్యేకమైన యువతి పాత్రలో ఇందులో రాగిణి ద్వివేది కనిపిస్తారు.
ఈ సినిమాలో స్మశాన నేపథ్యంలో సాగే రుద్రభూమి సన్నివేశాలు చాలా కీలకం. బెంగళూరు, మైసూర్లో జరిగిన షెడ్యూల్లో ఆ సన్నివేశాలను తెరకెక్కించాం. ఇది వైవిధ్యమైన కాన్సెప్ట్. కథ డిమాండ్ మేరకు దేశంలోని పురాతనమైన అనేక స్మశానాలలో షూటింగ్ చేశాం.
ఒక సంస్కృత విద్యార్థిగా ఈ సినిమాను సంస్కృతంలో తీస్తున్నందుకు గర్వంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని మంచి సినిమాలు తీయాలనుకుంటున్నా’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, వజ్రేశ్వరి కుమార్, గురుదత్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివ మల్లాల, నిర్మాణం: సర్వేజనాః సుఖినోభవంతు ఫిలింస్.