Ambajipeta Marriage Band | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే యువ నటుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు సుహాస్ (Suhas). ఈ టాలెంటెడ్ యాక్టర్ కలర్‌ఫొటో సినిమాతో సోలో హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించాడు. సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేసి.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
తాజాగా హీరోయిన్ శివాని నగరం (Shivani Nagaram)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆమె లుక్ షేర్ చేశారు మేకర్స్. వరలక్ష్మి పాత్రలో నటిస్తున్న శివాని కాలేజ్ బ్యాగ్ వేసుకొని మ్యారేజ్ బ్యాండ్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మ్యారేజ్ బ్యాండ్ టీం నేపథ్యంలో ఫన్ రైడ్ స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాస్ అండ్ టీం మల్జిఖార్జున సెలూన్ షాప్ ముందు బ్యాండ్ మేళం వాయించేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
సుహాస్ దీంతోపాటు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) టైటిల్‌తో మరో సినిమా కూడా చేస్తున్నాడు. రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఆనందరావ్ అడ్వంచర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
శివాని నగరం లుక్..
Wishing our ‘Lakshmi’ aka @Shivani_Nagaram a very very Happy Birthday from team #AmbajipetaMarriageBand 🥁🎷#AmbajipetaMarriageBand Teaser Out Very Very Soon… ❤️🔥#BunnyVas @ActorSuhas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP @SonyMusicSouth pic.twitter.com/tjzNEbATPV
— GA2 Pictures (@GA2Official) August 25, 2023
గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది…
ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁Here’s the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @ActorSuhas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/guIzq9UFu7
— BA Raju’s Team (@baraju_SuperHit) April 11, 2023
సుహాస్ ఆనందరావ్ అడ్వంచర్స్ లుక్..
And the Adventure begins in style ✌️
Here’s the Title & First Look of @XappieStudios Prod No-4 : #AnandaraoAdventures ❤️🔥
⭐ing @ActorSuhas
Directed by #RamPasupuletiA @MickeyJMeyer Musical 🎶
Produced by UdayKola, VijayShekhar, Suresh Kothinti#StreamlineProductions pic.twitter.com/vwImPj8uVs
— Xappie Studios (@XappieStudios) January 18, 2023