శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే రెండో షెడ్యూల్ను మొదలుపెట్టారు. 25 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో శివాజీ పాల్గొంటున్నారు. ఆయనపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, గ్రామాల్లో భూస్వాముల దౌర్జన్యాలపై సామాన్యుల తిరుగుబాటును చూపించే చిత్రమిదని, చక్కటి హాస్యం..వ్యంగ్యంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని మేకర్స్ తెలిపారు. నవదీప్, నందు, రవికృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ ఆర్ రాబిన్, దర్శకుడు: మురళీకాంత్.