నటుడు శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. లయ ఇందులో కథానాయిక. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. శివాజీ, లయ సీరియస్‌గా నడుస్తూ వస్తుండగా బాలనటుడు రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం ఈ పోస్టర్లో చూడొచ్చు. చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని, ఇందులో శివాజీ పంచాయితీ సెక్రటరీ శ్రీరామ్‌గా కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు.
‘90s’ వెబ్ సిరీస్‌లో శివాజీ, బాలనటుడు రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం తెలుగురాష్ర్టాల్లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం ఆసక్తికరమైన అంశం. అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిత్విక్‌రెడ్డి, సంగీతం: రంజిన్రాజ్, సమర్పణ: ఈటీవీ విన్, నిర్మాణం: శ్రీశివాజీ ప్రొడక్షన్స్.