టోక్యో-2020 ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్లో సింధు రజతం సాధించగా, వరుసగా రెండో ఒలింపిక్స్లో పతకం సాధించిన మహిళగా పీవీ సింధు నిలిచింది. ఇటీవల హైదరాబాద్ చేరుకున్న సింధు రీసెంట్గా విజయవాడకు వెళ్లి దుర్గామాత ఆశీస్సులు పొందింది. అనంతరం సీఎం జగన్ను కూడా కలిసింది.
పీవీ సింధు సాధించిన ఘనతపై పలువురు ప్రశంసలు కురిపించడమే కాకుండా సత్కరిస్తున్నారు. సినీనటుడు శివారెడ్డి ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి సత్కరించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను సింధుకు బహూకరించారు. వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించటం గర్వకారణమని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఇక తన కామెడీని సింధుతో పాటు ఆమె ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారని శివారెడ్డి పేర్కొన్నారు.