సౌత్ సినిమా టాప్‌స్టార్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఒకరు. తెలుగులో కూడా ఆయనకు అభిమానులున్నారు. దీనికితోడు కన్నడ సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో శివరాజ్‌కుమార్ సతీమణి గీతా శివరాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివరాజ్‌కుమార్ తాజా మూవీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ ఫిల్మ్‌గా తెరకెక్కించనున్నారు. కార్తీక్ అద్వైత్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, సుధీర్.పి నిర్మాతలు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఇప్పటికే మ్యూజిక్ కంపోజిషన్ కూడా మొదలైందని, ఆగస్ట్‌లో ఘనంగా ఓపెనింగ్ ఉంటుందని, ఇందులో శివరాజ్‌కుమార్ లుక్, కేరక్టర్ ప్రెజెంటేషన్ కొత్తగా డిజైన్ చేశామని దర్శకుడు తెలిపారు. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సివుంది. ఈ చిత్రానికి కెమెరా: ఏ.జె.శెట్టి, సంగీతం: సామ్ సి.ఎస్, సమర్పణ: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాణం: భువనేశ్వరి పిక్చర్స్.