Actress Kasthuri | మరోవివాదంలో నటి కస్తూరి.. లేడీ సూపర్‌స్టార్ నయనతార కాదంటూ కామెంట్
Actress Kasthuri | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) పై నటి కస్తూరి (Actress Kasthuri) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నయన్‌ను లేడీసూపర్ స్టార్‌గా ఒప్పుకోనని పేర్కొంది.
Actress Kasthuri | కొందరు నటీనటులు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి నటుల్లో హీరోయిన్ కస్తూరి (Actress Kasthuri ) ముందు వరుసలో ఉంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. ఇప్పటికే నయనతార సరోగసి విధానం, ఏ ఆర్ రెహమాన్ భార్య సైరా భానుకు తమిళ్ సరిగా రాకపోవడంపై, ఆదిపురుష్ చిత్రంలోని ప్రభాస్ పాత్రపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన తెలిసిందే. తాజాగా లేడీ సూపర్‌స్టార్ (Lady Superstar) గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నయనతార (Nayanthara). ఈ ప్రశ్న ఎవరిని అడిగినా నయన్ పేరే సమాధానంగా చెప్తారు. అంతగా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. అయితే, కస్తూరికి మాత్రం లేడీ సూపర్ స్టార్ నయన్ కాదంట. నయన్‌ని లేడీసూపర్ స్టార్‌గా ఒప్పుకోదట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరికి సూపర్ స్టార్ ఎవరు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె రజినీకాంత్ (Rajinikanth) అని టక్కున సమాధానమిచ్చింది. ‘ కోలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ రజినీకాంత్. అజిత్, విజయ్, కమల్ హాసన్ ఉన్నప్పటికీ రజినీకాంత్ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇదే సందర్భంలో నటీమణుల్లో లేడీ సూపర్ స్టార్ ఎవరు అని అడగ్గా.. ప్రస్తుతం ఉన్న నటీమణుల్లో సూపర్ స్టార్‌గా చెప్పుకోదగ్గవారు ఎవరూ లేరని బదులిచ్చింది. అయితే, అలనాటి నటీమణులు కేపీ సుందరాంబల్ (KP Sundarambal ), విజయశాంతి (Vijayashanthi) పేర్లను ప్రస్తావించింది. నయన్‌కు తానో అభిమానిని అంటూనే.. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనలేమంటూ వ్యాఖ్యానించింది. నయనతార నటించిన ‘మాయ’ (2015లో తమిళ్లో వచ్చిన హార్రర్ సినిమా) చిత్రం మాత్రమే ప్రాముఖ్యత కలిగిన కథగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కస్తూరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నయన్ ఫ్యాన్స్ కస్తూరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నయనతారపై కస్తూరి కామెంట్స్ చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. సరోగసి విషయంలో నయన్‌పై కస్తూరి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. గతేడాది జూన్‌లో వివాహం చేసుకున్న నయన్-విఘ్నేశ్ దంపతులు పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. సరోగసి ద్వారా బిడ్డల్ని కన్నట్లు వెల్లడించారు. దీంతో అప్పట్లో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అప్పుడు కూడా నయన్ అభిమానులు కస్తూరిపై మండిపడ్డారు. ‘నీ పని నువ్వు చేసుకో’ అంటూ చురకలంటించారు.
Also Read..
Jeff Bezos | ప్రియురాలి కోసం రూ.560 కోట్ల ఇంటిని కొనుగోలు చేసిన బెజోస్..?
Raghav Chadha | ట్విట్టర్ బయోలో కీలక మార్పు చేసిన ఆప్ నేత రాఘవ్ చద్దా
Delhi Services Bill | రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

