దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అంటే తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. హృదయాన్ని స్పృశించే ప్రేమకథలతో పాటు సామాజిక సమస్యలను కథా వస్తువులుగా తీసుకుంటారాయన. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ 51వ చిత్రమిది. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను చర్చించే కథాంశమిదని తెలుస్తున్నది.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కథను తయారు చేసుకున్నారని, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో అగ్ర నటుడు నాగార్జున కీలకమైన పాత్రలో నటించబోతున్నారని ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది.