గత ఏడాది డిసెంబర్లో శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఇప్పటివరకూ శర్వా సినిమాలేదు. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే ఈ విరామానికి కారణమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్నాడు శర్వా. ఈ సినిమా తర్వాత బ్లాక్బాస్టర్ ‘సామజవరగమనా’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ‘లూజర్’ వెబ్‌సిరీస్ డైరెక్ట్ చేసిన అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది శర్వా నటించిన మూడు సినిమాలు విడుదల అవుతాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.